Heavy Rains: ఉత్తరాదికి భారీ వర్ష సూచన..తొమ్మిది రాష్ట్రాలకు రెడ్ అలర్ట్

 Heavy Rains: ఉత్తరాదికి భారీ వర్ష సూచన..తొమ్మిది రాష్ట్రాలకు రెడ్ అలర్ట్

ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) శుక్రవారం రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాజస్థాన్ నుంచి ఈశాన్య దిశగా ద్రోణి , ఉత్తర పశ్చిమ బెంగాల్‌పై రుతుపవనాల కారణంగా ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరింది. రానున్న 4,5 రోజుల్లో వాయువ్య, తూర్పు భారతంలో భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. 

మరోవైపు శుక్రవారం (జూన్ 5) ఢిల్లీలో ఆకాశం మేఘావృతమై ఓ మోస్తరు వర్షం పడింది. ఉత్తరాఖండ్ ల జూల 3 నుంచి జూలై 6 వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతాన్ని నమోదు చేసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. జూలై 7న భారీ నుంచి అతిభారీవర్షాలు కురిస్తే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. 

రాజస్థాన్ లో శుక్రవారం (జూలై 5)  భారీ వర్షపాతం నమోదు అయిది. గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలకు 176 మి.మీటర్ల వర్షం నమోదు అయినట్లు ఐఎండీ తెలిపింది. దీంతో ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు అయ్యాయి. 

మరోవైపు పశ్చిమ బెంగాల్ లో కొన్ని ప్రాంతాల్లో జూలై 9వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. డార్జిలింగ్, కాలింపాంగ్, జల్పాయిగురి, అలీపుర్‌దువార్ , కూచ్‌బెహార్‌లోని సబ్-హిమాలయన్ జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షంతో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా తీస్తా, జల్ధాకా, సంకోష్ , తోర్సా వంటి నదుల నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉందని IMD తెలిపింది.

ఉత్తరాది రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిశాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అతలాకుతలం చేశాయి.